జగన్ అక్రమాస్తుల కేసు .. ఐఏఎస్ శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : సీబీఐ కోర్టు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ-ఈడీ కోర్టు శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దాల్మియా కేసులో శ్రీలక్ష్మి నిందితురాలిగా ఉన్నారు. అయితే, ఈ రోజు విచారణకు శ్రీలక్ష్మి , ఆమె తరపు న్యాయవాదులు గైర్హజరు అయ్యారు. దీంతో న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ ను ఈనెల 30 లోపు అమలు చేయాలని ఆదేశించింది.