లేప్రోసి వ్యాధి గ్రస్తులకు వివక్షత లేని సేవలు అందించాలి
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నందు శ్రీ డాక్టర్ ప్రదీప్త కుమార్ నాయక్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి , జాతీయ మానవ హక్కుల కమీషన్, డిల్లి వారి అద్యక్షతన జిల్లా సమన్వయ కమిటీ సమావేశము ఉదయం 10.30 గంటల నుండి మద్యాహ్నం 2.00 గంటల వరకు నిర్వహించడమైనది. ఈ సందర్బంగా శ్రీ డాక్టర్ ప్రదీప్త కుమార్ నాయక్ ప్రత్యేక పర్యవేక్షణ అధికారి జాతీయ మానవ హక్కుల కమీషన్ మాట్లాడుతూ లేప్రోసి వ్యాధి గ్రస్తుల కు సంబంధిoచిన సేవలు మరియు వారి హక్కుల పై జిల్లా సమన్వయ కమిటీ అధికారులతో చర్చించి వారివారి శాఖా పరంగా ఎటువంటి సేవలు అందిస్తున్నారు , ఇంకా మెరుగైన సేవలు అందించడానికి వాటికి సంబంధించిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా లేప్రోసి వ్యాధి గ్రస్తులకు వివక్షత లేని అందరితో సమానమైన సేవలు అందించాలని పిలుపు నిచ్చారు. ప్రతి శాఖ వారు అందించు సేవలు మరియు ప్రభుత్వ పథకాలలో లేప్రోసి వ్యాధి గ్రస్తుల జాభితాను తయారు చేసుకొని వారికి 100% సేవలు అందేటట్లు చూడాలని ఆదేశించారు. ఈ సమావేశం నందు జాయింట్ డైరెక్టర్ ( NLEP) డాక్టర్ సాగర్ , జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి. శాంతి కళ , జిల్లా కుష్టు, ఎయిడ్స్ & టీబీ అధికారి డాక్టర్ యెల్. భాస్కర్ ,ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరిన్టెంట్డెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు , DCHS డాక్టర్ మాధవి , సైకియాట్ట్రి ప్రొఫెసర్ డాక్టర్ నాగేశ్వర్ రావు , డర్మటాలజి ప్రొఫెసర్ డాక్టర్ పద్మజ , PO RBSK డాక్టర్ శైలేష్ కుమార్ , జిల్లా నూక్లియస్ వైధ్యాదికారి డాక్టర్ జి.మల్లికార్జున రెడ్డి , సైకియాట్ట్రిస్ట్ డాక్టర్ చైతన్యకుమార్ , గృహనిర్మాణ శాఖ నుండి ప్రభాకర్, డిసబుల్ద్ వెల్ఫేర్ శాఖ నుండి సోలోమన్ రాజ్ , ట్రైబల్ వెల్ఫేర్ శాఖ నుండి సీమన్ , సోషల్ వెల్ఫేర్ శాఖ నుండి రంగలక్ష్మిదేవి , విద్యా శాఖ నుండి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.