పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు
1 min read-దేవనూరు పల్లెకు పోదాంలో తువ్వా లోకేశ్వర రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడంలో వైకాపా ప్రభుత్వం ముందంజలో ఉందని వైసీపీ మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని దేవనూరు గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగిన పల్లెకు పోదాం అనే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన సమావేశంలో గ్రామానికి వివిధ పథకాల ద్వారా వచ్చినటువంటి నగదు వివరాల గురించి బోర్డును లోకేశ్వర్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ హరిత,ఎంపీటీసీ ఫరీదాభి,ఎంపీడీవో జిఎన్ఎస్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికీ కూడా సంక్షేమ పథకాలు అందించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఉన్నారని ప్రతిపక్ష పార్టీకి కూడా తలుపు తట్టి పథకాలు అందిస్తున్నామని కానీ వారు ఓర్వలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. తదనంతరం గ్రామంలో పార్టీ జెండాను నాయకులు ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో జెసిఎస్ మండల కన్వీనర్ రవికుమార్,మండల కో ఆప్షన్ సభ్యులు పెద్దమౌలా,వైసీపీ నాయకులు సుంకిరెడ్డి,నవాజ్ అలీ,శ్రీనివాసులు,అమీర్ భాష, డీలర్లు వెంకటేశ్వర్లు,గోరె భాష తదితరులు పాల్గొన్నారు.