దేవుళ్లు ఎవరూ బ్రాహ్మణులు కాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఢిల్లీ జేఎన్యూ వీసీ శాంతిశ్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుళ్లలో ఒక్కరు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారు కాదని ఢిల్లీలోని జేఎన్ యూ వైస్ చాన్స్ లర్ శాంతిశ్రీ ధూళిపూడి పండిట్ అన్నారు. పరమశివుడు కూడా ఎస్సీ లేదా ఎస్టీకి చెంది ఉండొచ్చన్నారు. ఇటీవల చోటుచేసుకున్న మత హింస ఘటనలపై ఆమె స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘మానవ శాస్త్ర పరంగా మన దేవుళ్ల మూలాలు ఏంటన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఏ దేవుడూ బ్రాహ్మిణ్ కాదు. క్షత్రియులే అధికులు. లార్డ్ శివ షెడ్యూల్డ్ క్యాస్ట్ లేదా ట్రైబ్ కు చెంది ఉంటారు. ఎందుకంటే ఆయన శ్మశాన వాటికలో కూర్చుకోవడం, మెడలో పాము ధరించడం, కొన్ని వస్త్రాలే ధరించడం చూడొచ్చు. బ్రాహ్మణులు శ్మశాన వాటికలో కూర్చుంటారని నేను అనుకోవడం లేదు’’ అని శాంతిశ్రీ అన్నారు. ‘లింగ సమానత్వంపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనలు’ అన్న అంశంపై ఆమె మాట్లాడారు.