చావుకు బయపడే వ్యక్తిని కాదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ జడ్ కేటగిరి భద్రతను తిరస్కరించారు. యూపీలో ఓవైసీ కారుపై కాల్పులు జరిగిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అసదుద్దీన్ కు జడ్ కేటగిరి భద్రత కల్పించింది. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ లోక్‌సభలో తనపై జరిగిన దాడి అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా తనకు కేటాయించిన జెడ్ కేటగిరి భద్రతను తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. నేను చావుకు భయపడే వాడిని కాను. నాకు ప్రజలే రక్షకులు. నాపై దాడి చేసిన వారిపై ఉపా యాక్ట్ వర్తింపజేయాలి’ అని అసదుద్దీన్ ఓవైసీ కోరారు.