ఎల్లమ్మ జాతర జరపడంలేదు: ఎస్ఐ
1 min readపల్లెవెలుగువెబ్, చెన్నూరు : కరోన కేసులు పెరుగుతుండటంతో మండలంలోని కే ఆర్ కాలనీలో వెలిసిన ఎల్లమ్మ జాతరను ఈ ఏడాది నిలిపివేసినట్లు ఎస్ఐ బీ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. ఇందుకు మండల ప్రజలు, పెద్దలు సహకరించాలని ఆయన కోరారు. శుక్రవారం ఎస్ఐ విలేకరులతో మాట్లాడుతూ అవసరం ఉంటే తప్పా బయటకు రావొద్దని, మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు అమలులో భాగంగా ఎల్లమ్మ జాతర నిలిపివేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు.