అమిత్ షా కాదు.. అబద్ధాల బాద్ షా
1 min readపల్లెవెలుగువెబ్ : అమిత్ షా తెలంగాణ పర్యటన పై కేటీఆర్ స్పందించారు. అమిత్ షా మాట్లాడిన అబద్దాలు చూస్తుంటే తన పేరు మార్చుకోవాలి. తన పేరు అమిత్ షా కాదు అబద్దాల బాద్ షాగా మార్చుకోవాలి. తుక్కుగూడలో తుక్కు డిక్లరేషన్ అంతా తుప్పే మాటలే. కేంద్ర మంత్రి హోదాలో ఉండి వాస్తవాలు చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్ళాడు. పదవులు అమ్ముకునే దౌర్భాగ్యులు, హీనులు, చిల్లర పార్టీ బీజేపీ. కర్నాటకలో 40 శాతం కమీషన్ ఇవ్వకపోతే నిధులు ఇచ్చే పరిస్థితి లేదు.. అవినీతి ఎవరిది?. సీఎం పదవిని అమ్ముకునే మీ పార్టీ అవినీతి పార్టీ కాదా?. చైతన్యవంతమైన పార్టీ టీఆర్‌ఎస్‌పైన పిచ్చిగా మాట్లాడటం మంచిది కాదు. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నాడు. నిజాం వారసులుగా బీజేపీ నేతలు పదే పదే తలుచుకుంటున్నారు. ఈ ఎనిమిది ఏళ్లలో కేంద్రం తెలంగాణకు చేసింది ఏమిటో చెప్పాలని అడిగామ
అని అన్నారు.