అమ్మఒడి కాదు.. ఆక్సిజన్ ఇవ్వండి..!
1 min read
పల్లెవెలుగు వెబ్: ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అమ్మ ఒడి వద్దు.. ఆక్సిజన్ ఇవ్వమంటున్నారని టీడీపీనేత నక్కా ఆనందబాబు అన్నారు. జగనన్న వసతిదీవెన వద్దు.. ఆస్పత్రిలో వసతి కల్పించమని కోరుతున్నారని చెప్పారు. ఇంటింటికి రేషన్ కాదు.. వ్యాక్సిన్ ఇవ్వమని ప్రజలు కోరుతున్నారని అన్నారు. బతుకుతామనే భరోసా కల్పించాలని కోరతున్నారని తెలిపారు. ప్రజల దృష్టి మరల్చేందుకే చంద్రబాబు మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.