PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అర్హత లేదు

1 min read

పల్లెవెలుగు  వెబ్ నంద్యాల :   ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చే అర్హత లేదు ఏపీ బీసీ సంక్షేమ సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షులు  వై నాగ శేషు2018 ఎలక్షన్ లో భాగంగా  అంగన్వాడి సోదరీమణులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని రెగ్యులర్ జాబ్ చేసే వారి కంటే ఎక్కువ పని చేస్తున్న అంగన్వాడీలకు ఔట్సోర్సింగ్ వారికి రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చి నిలబెట్టుకోలేని ప్రభుత్వానికి నోటీసులు  ఇచ్చే అర్హత ఎక్కడిది అని  బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వై నాగ శేషు  ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ  పాలకులకు ఒక న్యాయం పనిచేసే వారికి ఒక న్యాయమా పాలన చేతకాక కార్పొరేషన్ల పేరుతో కాలయాపన చేసి సంక్షేమ పథకాల పేరుతో ప్రభుత్వ ఖజానాను  ఓటు బ్యాంకు రాజకీయాల కోసం పప్పులు బెల్లంల పంచిపెట్టి రాష్ట్రం దివాలా తీసే స్థితికి తీసుకొని  వచ్చిన చేతగాని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడతారా.  మాట తప్పను మడమ తిప్పను అని  ప్రగల్ బాలు పలికి  ఇప్పుడు మేకపోతు గాంభీర్యం  ప్రదర్శిస్తున్నావు. నమ్మి అధికారం కట్టబెడితే నయవంచనతో రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచడానికి సిద్ధపడ్డ  నీవు చరిత్ర హీనుడిగా చరిత్రలో కనుమరుగు కాక తప్పదని గుర్తుంచుకో.  దండోరా ఎమ్మార్పీఎస్  జిల్లా అధ్యక్షులు ఎన్ లక్ష్మణ్ మాట్లాడుతూ  కాలం చెల్లిన బ్రిటిష్ నల్ల చట్టాలను కూడా రాష్ట్ర ప్రజలపై ఉద్యోగస్తులపై  ప్రయోగిస్తున్నావంటే నీ అహంకార ధోరణికి నిదర్శనం  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రాజ్యాంగాన్ని లెక్కచేయను నీకు రాజ్యాంగంలో ప్రజలకు ఇచ్చిన బలమైన ఓటు అనే ఆయుధంతో నీకు బుద్ధి చెప్పి రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును భావితరాల భవిష్యత్తును కాపాడుకుంటామని  తెలియజేశారు.

About Author