NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు ఆసక్తి లేదు : సోనూసూద్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: స‌హాయం చేస్తే వ‌చ్చే ఆత్మసంతృప్తి వేర‌ని, ఇంట్లో కూర్చుని మాట‌లు మాట్లాడితే ప‌నులు జ‌ర‌గ‌వ‌ని ప్రముఖ న‌టుడు సోనూసూద్ అన్నారు. రాజ‌కీయం ఒక అద్భుత‌మైన రంగ‌మ‌ని, మంచి చేస్తే రాజ‌కీయాల్లోకి రావాల‌నే మంచి చేస్తున్నార‌నే భావ‌న ప్రజ‌ల్లో పాతుకుపోయింద‌ని అన్నారు. రాజ‌కీయాల్లోకి రావాల‌ని, మంచి చేయాల‌ని ఎంద‌రో అనుకుంటార‌ని, కానీ చాలా మంది రాలేర‌ని ఆయ‌న చెప్పారు. ‘ రాజ‌కీయాల‌తో నాకు ఎలాంటి విబేధాలు లేవు. కానీ రాజ‌కీయాల్లో కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు ఉంటాయి. వాటికి అనుగుణంగా న‌డుచుకోవాలి. ఇప్పుడు చేసిన‌ట్టు సేవ చేయ‌డానికి కొన్ని అడ్డంకిగా ఉంటాయి’ అని సోనూసూద్ తెలిపారు. తాను రాజ‌కీయాల్లోకి రావ‌డానికి మాన‌సికంగా సిద్దంగా లేన‌ని, రాజ‌కీయాల్లోకి వెళ్తే చేసే సేవే ఇప్పుడు చేయ‌గ‌లుగుతున్నాన‌ని ఆయ‌న చెప్పారు.

About Author