జగన్ కే కాదు.. గాడ్సేకూ అభిమానులు ఉన్నారు !
1 min read
పల్లెవెలుగు వెబ్ : రాష్ట్రంలో జరగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇస్తే వైకాపాకు ముచ్చెమటలు పట్టిస్తామని దెందలూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవకుంటే పార్టీ కార్యాలయం మూసేస్తామని అన్నారు. టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి పదవి కోసం కొడాలి నాని ఇన్నాళ్లు టీడీపీ వారిని తిట్టారని, త్వరలో ఆయన మంత్రి పదవి పోవడం ఖాయమన్నారు. జగన్ కే కాదు.. గాడ్సేకు అభిమానులు ఉన్నారని అన్నారు. తాము కూడ ఉప్పూ కారం తింటున్నామని, మాకూ బీపీ వస్తుందని చింతమనేని అన్నారు.