బాలీవుడ్ గురించి అలా మాట్లాడలేదు !
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ ను తక్కువ చేసి మాట్లాడాలని కానీ, ఆ ఇండస్ట్రీని అవమానించాలని కానీ.. తనకు లేదని సూపర్ స్టార్ మహేష్ బాబు తన పీఆర్ టీమ్ ద్వారా మీడియాకు తెలియజేశారు. జాతీయ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు.. తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు? అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘తెలుగు ఇండస్ట్రీని విడిచి ఇతర ఇండస్ట్రీలలో పనిచేయాలనే ఆలోచన లేదు. తెలుగు సినిమాలతోనే మరింత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను. టాలీవుడ్‌లో నాకు ఉన్న ఆదరణ, ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. వాటిని వదులుకొని వేరే పరిశ్రమ వైపు వెళ్లాలనే ఆలోచన నాకు లేదు. మొదటి నుంచి నేను తెలుగు ఇండస్ట్రీ అని చెబుతున్నాను. బాలీవుడ్ నుంచి ఎన్నో అవకాశాలు వచ్చాయి. బాలీవుడ్ నన్ను భరించలేదు. అక్కడికి వెళ్లి సమయాన్ని వృధా చేసుకోవాలని అనుకోవడం లేదు. అందుకే బాలీవుడ్ వద్దనుకున్నా. తెలుగు సినిమాలే నా బలం’’ అని మహేష్ అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు దర్శనమిచ్చాయి. దీంతో అలెర్ట్ అయిన మహేష్ పీఆర్ టీమ్ స్పందించింది.