NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రాజీనామా ప్రస‌క్తే లేదు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌ర్ణాట‌క‌లో నాయ‌క‌త్వ మార్పు జ‌ర‌గ‌నుందంటూ వ‌స్తున్న వార్తల‌పై సీఎం య‌డియూర‌ప్ప స్పందించారు. రాజీనామా చేసే ప్రస‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు. రాజీనామాపై వ‌స్తున్న ఊహాగానాల్లో ఎలాంటి వాస్తవం లేద‌న్నారు. క‌ర్ణాట‌క‌లో ప్రాజెక్టులు, పార్టీ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించేందుకే ఢిల్లీ వ‌చ్చిన‌ట్టు తెలిపారు. య‌డియూర‌ప్ప, ఆయ‌న కుమారుడు విజ‌యేంద్ర ప్రత్యేక విమానంలో శనివారం ఢిల్లీ చేరుకున్నారు. ప్రధాని మోదీతో స‌మావేశ‌మ‌య్యారు. దీంతో క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. దీంతో మీడియా య‌డియూరప్పను ప్రశ్నించాగా.. రాజీనామా చేసే ప్రస‌క్తే లేద‌ని చెప్పారు. మేకెదాటు ప్రాజెక్టు గురించి చ‌ర్చించేందుకు ఢిల్లీ వ‌చ్చిన‌ట్టు, ప్రాజెక్టు సాధించి తీరుతామ‌ని తెలిపారు.

About Author