సహించేది లేదు.. నారా రోహిత్ స్ట్రాంగ్ వార్నింగ్ !
1 min readపల్లెవెలుగు వెబ్ : నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబం పై శాసనసభలో వైసీపీ నేతల వ్యాఖ్యలను ప్రముఖ హీరో నారా రోహిత్ ఖండించారు. మరోసారి ఇలాంటి ఘటన జరిగితే సహించేదిలేదన్నారు. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నందమూరి కుటుంబం ఏనాడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదని, ఎప్పుడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదని నారా రోహిత్ అన్నారు. పెద్దమ్మ భువనేశ్వరి సేవా కార్యక్రమాలే పరమావధిగా జీవిస్తున్న మహోన్నత వ్యక్తిత్వం ఆమెదన్నారు. అటువంటి ఆదర్శనీయురాలిపై లేనిపోని నిందలు మోపడానికి వైసీపీ నేతలకు నోరెలా వచ్చిందో అర్థంకావడంలేదన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం మరోమారు ఇటువంటి దారుణానికి ఒడిగడితే సహించేది లేదని నారా రోహిత్ మరోసారి వైసీపీ నేతలను హెచ్చరించారు.
ReplyForward |