ఆత్మలతో కాదు.. మంత్రులతో మాట్లాడండి !
1 min read
పల్లెవెలుగు వెబ్: సీఎం జగన్ అర్థరాత్రి ఆత్మలతో మాట్లాడటం ఆపి.. మంత్రులు, అధికారులతో మాట్లాడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్ అన్నారు. సీఎం జగన్ ఆత్మలతో కాకుండా… అంతరాత్మతో మాట్లాడాలని, నిరుద్యోగ యువత సమస్యలను తీర్చాలని కోరారు. నిరుద్యోగులను నిలువునా ముంచిన ‘జాబ్ లెస్’ క్యాలెండర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చిన 2లక్షల ముప్పై వేల ఉద్యోగాలతో కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ట్వీట్ చేశారు.