NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అక్రమ కేసులకు జడిసేది లేదు…. భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్ది 

1 min read

పల్లెవెలుగు  వెబ్ కడప :  తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే తమ అధినేత నారా చంద్రబాబు నాయుడు పైన తన తండ్రి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పైన అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి అన్నారు గత గ్రాడ్యుయేట్స్ ఎన్నికలలో పులివెందులలోనే టిడిపికి ఎక్కువ ఓట్లు రావడంతో వైసిపి ఓర్వలేకపోతుందని ఆయన మండిపడ్డారు కడపలో మీడియాతో మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టినంత మాత్రాన నాయకులను టిటిపి కి దూరం చేసి అధికారంలోకి రావచ్చు అని వైసిపి కలలు కంటోందన్నారు.. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి పైన కేసులు కొత్త కాదని గతంలో కూడా అక్రమంగా అత్య కేసులు కూడా నమోదయిన తాము ప్రజల పక్చాన పోరాటం చేయడం ఆపలేదని ఈ విషయాన్ని వైసిపి గుర్తు చేసుకోవాలన్నారు.. నారా లోకేష్ చేస్తున్న యువగలం పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందన చూసి ఇక అధికారంలోకి రాలేమని వైసిపి ఇలాంటి దారుణాలకు పాల్పడుతుందన్నారు.. అక్రమ కేసులు ఎన్ని పెట్టిన తాము టిడిపిలోనే కొనసాగుతామని ప్రజల పక్షాన పోరాటం చేస్తామని భూమి రెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి అన్నారు టిడిపి కార్యకర్తలు అందరూ మనోధైర్యంగా ఉండాలన్నారు.. తమ తండ్రి తో పాటు నారా చంద్రబాబు నాయుడు గారి ఇతర టిడిపి నేతల పై పెట్టిన కేసులపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.. అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులు అందుకు సంబంధించిన మూల్యం త్వరలోనే చెల్లించుకుంటారని ఆయన హెచ్చరించారు.

About Author