జగన్ పై సభా హక్కుల నోటీసు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. కల్తీ సారా మరణాలను సహజమరణాలుగా చిత్రీకరించి సభను, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని టీడీపీ సభ్యులు ఉభయ సభల్లో సభాహక్కుల నోటీసు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మృతుల పట్ల విచారణ కోరితే పట్టించుకోలేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మృతుల విషయమై సీఎం జగన్‌రెడ్డి గుడ్డిలెక్కలు చెప్పారన్నారు. ఏమీ తెలుసుకోకుండానే నాటుసారా కాయలేదనడం సరికాదన్నారు. అధిక మద్యం ధరలతో నాటుసారా తాగి ప్రజలు చనిపోతున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.