నేడు మాజీ సీఎంకు నోటీసులు
1 min read– కర్నూలు ఎస్పీ డా.ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై కర్నూలు ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనందున సీఆర్పీసీ 41(ఏ) కింద ఆదివారం నోటీసులు అందజేస్తామని ఎస్పీ డా. ఫక్కీరప్ప వెల్లడించారు. ఎన్440కే వైరస్ కర్నూలులో పుట్టిందని, ప్రజలను భయాందోళనకు గురి చేసేలా మాట్లాడారంటూ.. మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై న్యాయవాది మాసుపోగు సుబ్బయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదయ్యిందన్నారు. ఆదివారం ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ ద్వారా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు నోటీసులు అందజేస్తామని, వారం రోజులు గడువు ఇస్తామన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేయొచ్చు కానీ… ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడటం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామన్నారు.