NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు కొన‌సాగుతున్న నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఎంపీపీ, జ‌డ్పీ చైర్మన్ ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. మండ‌ల ప‌రిష‌త్, జిల్లా ప‌రిష‌త్ అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక‌కు తేదీలు ఖరారు చేసింది. ఎస్ఈసీ నీలం సాహ్నీ ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 24న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు ఎంపీపీ, వైఎస్ ఎంపీపీ.. 25న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు జ‌డ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక చేప‌ట్టనున్నారు. గ‌తంలో ప‌రిష‌త్ లో ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ను మాత్రమే ఎన్నుకునే వారు.. కానీ ఇటీవ‌ల రాష్ట్ర ప్రభుత్వం పంచాయ‌తీ రాజ్ చ‌ట్టంలో స‌వ‌ర‌ణ‌లు చేయ‌డంతో రెండో వైస్ చైర్మన్ ను కూడ ఎన్నుకోనున్నారు.

About Author