NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏపీలో ఫార్మసీ, ఇంజినీరింగ్ ప్రవేశాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నెల 25 నుంచి 30 వ‌ర‌కు ఆన్ లైన్ లో రిజిస్ట్రేష‌న్లు, ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించిన‌ట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ తెలిపారు. ఈనెల 26వ తేది నుంచి 31 వ‌ర‌కు అభ్యర్థుల స‌ర్టిఫికెట్ల ప‌రిశీల‌న చేస్తున్నట్టు ఆయ‌న చెప్పారు. నవంబ‌ర్ 1 నుంచి 5 వ‌ర‌కు ఇంజినీరింగ్, ఫార్మసీ వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవాల‌ని సూచించారు. ఆప్షన్ల మార్పుకు న‌వంబ‌ర్ 6న అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. పూర్తీగా ఆన్ లైన్ ప్రవేశాల ప్రక్రియ‌ చేప‌ట్టామ‌ని, స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ కూడ ఆన్ లైన్ లోనే జ‌రుగుతుంద‌న్నారు.

About Author