PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు జిల్లాలో అంగన్వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌ర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న అంగ‌న్వాడీ వ‌ర్కర్స్, మిని అంగ‌న్వాడీ వ‌ర్కర్స్, ఆయాల పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన‌ట్టు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కె. ప్రవీణ ఓ ప్రక‌ట‌న‌లో తెలిపారు. 44 అంగ‌న్వాడీ వ‌ర్కర్స్, రెండు మినీ అంగ‌న్వాడీ వ‌ర్కర్స్, 310 అంగ‌న్వాడీ ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ప్రక‌ట‌న‌లో తెలిపారు. వీటి భ‌ర్తీకి అర్హులైన మ‌హిళా అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోన్నట్టు ఆమె వెల్లడించారు. ఈ మూడు కేట‌గిరి పోస్టుల‌కు ప‌దో త‌ర‌గతి విద్యార్హత . 1-7-2021 నాటికి 21 నుంచి 35 సంవ‌త్సరాల‌లోపు వ‌య‌స్సు ఉండాలి. మ‌రిన్ని వివ‌రాల‌కు సీడీపీవో కార్యాల‌యాల్లో సంప్రదించాల‌ని కోరారు.

About Author