దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
1 min readపల్లెవెలుగు, కల్లూరు అర్బన్ : వివిధ శాఖలలోని విభిన్న ప్రతిభావంతుల (దివ్యాంగులు) డియస్సి (13) అనగా జూనియర్ స్టెనో(ఇంగ్లీష్) -01 పోస్టు అంధులు (స్త్రీ), టైపిస్టు-02 పోస్టులు అంధులు (జనరల్) మరియు నాన్ డియస్సి (04) అనగా ల్యాబ్ టెక్నిషియన్ (గ్రేడ్-2)- 01 పోస్టు మూగ, చెవిటి వారు (జనరల్), ల్యాబ్ అటెండెంట్ -01 పోస్టు మూగ, చెవిటి వారు(జనరల్), కార్యాలయపు సబార్డినేట్/అటెండర్-01 శారీరక (చలన) వికలాంగులు (జనరల్), పి. హెచ్ వర్కర్-01 అంధులు (జనరల్) బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషనను అన్ని వివరములతో కర్నూలు డిస్ట్రిక్ వెబ్సైట్ (www.kurnool.ap.gov.in) నందు ఉంచడమైనది. అర్హులైన ధరఖాస్తుదారులు నిర్ణీత ధరఖాస్తును పూరించి అట్టి ధరఖాస్తు మరియు దానికి సంబంధించిన ధృవ పత్రములను (జిరాక్స్) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి ఈ కార్యాలయమునకు అనగా సహాయ సంచాలకులు, విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల మరియు వయో వృద్ధుల సంక్షేమశాఖ, కలెక్టర్ కాంప్లెక్స్, కర్నూలు తేది: 10-11-2022 సాయంత్రము 5.00 గంటలలోగా సమర్పించవలెయును అని తెలిపారు.