ఘనంగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు..
1 min read– విగ్రహం ఆవిష్కరించిన మాజీ మంత్రి కింజరపు అచ్చన నాయుడు..
– ఘన స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జ్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలలో భాగంగా స్థానిక 21వ డివిజన్, సత్రంపాడు నందు సత్రంపాడు గ్రామ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటు కమిటీ వారు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహని ఆవిష్కరించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు విచ్చేసిన కింజరాపు అచ్చెన్నాయుడు కి స్థానిక C.R రెడ్డి మహిళా కళాశాల నుండి సత్రంపాడు వరకు వందలాది మోటార్ సైకిల్ లతో ర్యాలీ నిర్వహించి ఘన స్వాగతం పలికరు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే ,ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ కు చెందిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిలు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులు, కార్యకర్తలు మరియు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అచ్చయ్య నాయుడు మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు ప్రజలకు చేసిన సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రీతి కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన విధివిధానాలను కొనియాడారు. స్థానిక టిడిపి సర్పంచ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పాలి ప్రసాద్, కార్పొరేటర్ సోము పృద్వి శారద, మరియు టిడిపి నాయకులు అశోక్ గౌడ్, ఏ ఏం సి చైర్మన్ పూజారి నిరంజన్, దాసరి ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.