రాజధానిలో డా.ఎన్టీఆర్ హెల్త్ ట్రస్టుకు స్థలం కేటాయించండి
1 min read
సీఎం చంద్రబాబు నాయుడును కోరిన డా.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ డా. చంద్ర శేఖర్
కర్నూలు ( హాస్పిటల్ ), న్యూస్ నేడు :ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ తరుపున కాలేజి, హాస్పిటల్ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని సీఎం చంద్ర బాబు నాయుడును డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ, ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. చంద్ర శేఖర్ కోరారు. ఈ మేరకు బుధవారం సీఎం చంద్రబాబు నాయుడును విజయవాడలో కలిసి ట్రస్టు స్థలానికి సంబంధించి ప్రతిపాదనలు అందించారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిలో 30 ఎకరాలు డా. ఎన్టీఆర్ ట్రస్టుకు కేటాయిస్తే బాగుంటుందన్నారు. ఆ స్థలంలో కాలేజి, ఆస్పత్రి ఏర్పాటు చేస్తే… భవిష్యత్లో యూనివర్శిటీ అభివృద్ధికి బాటలు వేయడంతోపాటు ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించే అవకాశం ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు… రాజధాని నిర్మాణంలో భాగంగానే డా. ఎన్టీఆర్ హెల్త్ ట్రస్టుకు స్థలం కేటాయించేలా చూస్తానని స్పష్టం చేసినట్లు వైస్ ఛాన్సలర్ డా. చంద్ర శేఖర్ వెల్లడించారు.