NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్టీఆర్ ఇంట్లోకి… ఇట‌లీ లంబోర్గిన

1 min read

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఈ మ‌ధ్య త‌ర‌చూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఆయ‌న ఏం చేసినా.. ఏం కొన్నా.. ఏం వేసుకున్నా.. అదొక సంచ‌ల‌నంగా సోష‌ల్ మీడియాలో చ‌క్కర్లు కొడుతోంది. ఇటీవ‌ల ఆయ‌న మాస్క్ కూడ పెద్ద చ‌ర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు మ‌రొక టాపిక్ నెట్టింట్లో చ‌క్కర్లు కొడుతోంది. అదేంటంటే… ఆయ‌న కొత్తగా కొన్న స్పోర్ట్స్ కారు. దీని పేరు లంబోర్గిని. ఇది మేడిన్ ఇట‌లీ. అన్ని హంగులు ఉన్న స్పోర్స్ట్ కార్. ఎడారులు, కొండ‌లు, గుట్టలు, మ‌ట్టి రోడ్లు… ఎలాంటి రోడ్లలో అయినా స‌రే వేగంగా దూసుకుపోయే స్పోర్స్ట్ కార్ లంబోర్గిని. దీని ఖ‌రీదు కూడ త‌క్కువేం లేదండోయ్. అక్షరాల 5 కోట్ల రూపాయ‌లంట‌. దీంతో ఈ కారు ఇంకా ఎన్టీఆర్ గ్యారేజ్ కు చేర‌క‌ముందే సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

About Author