PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తెలుగు వారి గుండెల్లో చిరస్మరణీయులు ఎన్టీయార్

1 min read

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన మాండ్ర

లెజండరీ బ్లెడ్ డోనేషన్ కు విశేష స్పందన

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పేదవాడికి అసలైన సంక్షేమాన్ని అందించిన తొలి ముఖ్యమంత్రిగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా మిగిలిపోయారని టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇంఛార్జి మాండ్ర శివానంద రెడ్డి తెలిపారు.గురువారంఎన్టీయార్ 28వ  వర్ధంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని అల్వాల శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో   ఎన్టీయార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘన నివాళులు అర్పించారు.అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. టీడీపీ నాయకులు కార్యకర్తలు పోటీ పడి రక్తదానం చేశారు. జోహార్ ఎన్టీయార్ అంటూ పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ “తెలుగు జాతి పేరు చెబితేనే ప్రపంచ వ్యాప్తంగా స్మరించుకునే వ్యక్తి, విశ్వవిఖ్యాత నటసార్వభౌమునిగా కీర్తి గడించిన వ్యక్తి , పార్టీ పెట్టిన 9నెలల్లోనే అధికారంలోకి వచ్చిన ప్రజా భంధువు స్వర్గీయ నందమూరి తారక రామారావు అని అన్నారు. తన పాలనతో ప్రభుత్వాలు పేదల కోసం ఏ విధంగా పని చేయాలో గొప్ప నిదర్శనంగా చూపిన వ్యక్తి ఎన్టీయార్ అని, ఆ మహనీయుని వర్ధంతికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కలిసి ఘన నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. మహనీయుని స్పూర్తితో రానున్న సార్వత్రిక  ఎన్నికలలో టీడీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రవేశపెట్టిన  సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్  గుండం రమణా రెడ్డి, మాజీ ఎంపీపీ ప్రసాద్  రెడ్డి, మిడుతూరు మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి, జూపాడుబంగ్లా మండల కన్వీనర్ గిరీశ్వర రెడ్డి, మండ్లెం మోహన్ రెడ్డి,  తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య, నందికొట్కూరు టీడీపీ అధికార ప్రతినిధి కాకరవాడ చిన్న వెంకట స్వామి, మైనార్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి షకీల్ అహమ్మద్,  తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఐటీడీపీ అధ్యక్షులు ముర్తుజావలి,పట్టణ టిడిపి నాయకులు ఎస్ఎండి జమీల్,రసూల్ ఖాన్,పగిడ్యాల టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, పట్టణ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి,ఎస్సీ సెల్ నాయకులు నిమ్మకాయల మోహన్,పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న,ఐ-టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభు కుమార్,కళాకర్ , పాలమర్రి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author