PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పొలిటికల్ ఎంట్రీ పై ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు

1 min read

ఎవరు మీలో కోటీశ్వరుడు షో త్వరలో జెమిని టీవీ చానెల్ లో రాబోతోంది. దీనికి సంబంధించి మీడియా సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరుల పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. రాజకీయ రంగ ప్రవేశం ఎప్పుడు ఉంటుందని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎన్టీఆర్ స్పందించారు. రాజకీయాలకు సంబంధించిన వివరాలు మాట్లాడేందుకు ఇది సమయం.. సందర్భం కాదని, మరోసారి ఇలాంటి విషయాలు తీరికగా మాట్లాడుతూ కాఫీ తాగుదామని సమాధానం చెప్పారు. అయితే ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ పరాజయం తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు పర్యటించారు. ఆ సమయంలో టిడిపి కార్యకర్తలు జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీ లో కి తీసుకురావాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.

About Author