NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ఎవ‌రు మీలో కోటీశ్వరుడు’ షోలో ఎన్టీఆర్

1 min read

జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవ‌రు మీలో కోటీశ్వరుడు’ షోకు జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్యవ‌హ‌రించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన వివరాల‌ను మీడియా ముందు వెల్లడించారు. జూనియ‌ర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ చిరంజీవి, నాగార్జున ‘మీలో ఎవ‌రు కోటీశ్వరుడు’ షోతో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశార‌ని, అలాంటి బెంచ్ మార్క్ క్రియేట్ చేసేందుకు తాను కృషి చేస్తాన‌ని ఎన్టీఆర్ తెలిపారు. మెద‌టి షోకు హోస్ట్ ఎవ‌రు అనేది జెమినీ సంస్థ వారు నిర్ణయిస్తార‌ని తెలిపారు. డ‌బ్బు కేవలం ఒక భ‌ద్రతే కాని.. ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వదని అన్నారు. ఎవ‌రు మీలో కోటీశ్వరుడు అనే షో పార్టిసిపెంట్స్ ఖ‌చ్చితంగా జీవితంలో గెల‌వ‌గ‌ల‌మ‌నే ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంద‌ని అన్నారు.

About Author