హెచ్.ఎస్.ఆర్.పి. నంబర్ ప్లేట్లు తప్పనిసరి
1 min readఉప రవాణా కమిషనర్ ఎస్.శాంతకుమారి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు కలిగి లేని కొత్త మరియు పాత వాహనాలపై కేసులు నమోదు చేయబడతాయని ఉప రవాణా కమిషనర్ ఎస్.శాంత కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. దేశ అత్యున్నత న్యాస్థానం మరియు రాష్ట్ర రవాణా కమిషనరు వారి ఆదేశాల మేరకు హెచ్.ఎస్.ఆర్.పి. నంబర్ ప్లేట్లు లేని రవాణా, రవాణేతర వాహనాలకు ఇకపై ఫిట్నెస్ మరియు రెన్యూవల్ చేయబడవన్నారు. కొత్త వాహనాలకు డీలర్ల వద్దనే నంబరు ప్లేట్లు బిగిస్తుండగా, పాత వాహనాలకు మార్చి ఒకటవ తేది నుంచి ఎస్ ఐ ఏ యం (SIAM )పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. ఈ విధానంలో రెండు వెసులుబాట్లు కలిపిస్తున్నామని, ఒకటి డీలర్ వద్ద కాగా, మరొకటి వాహన యజమాని ఇంటి వద్దనే నంబరు ప్లేట్లు బిగించే విధానం ఉందన్నారు. వాహనదారులు ఇంకను ఏదైన సమాచారం కొరకు సంబంధిత రవాణా శాఖ కార్యాలయాన్ని సంప్రదించవచ్చునని ఆమె తెలిపారు.