అంగన్వాడీ కేంద్రంలో.. పోషకాహార పక్షోత్సవాలు..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : మంగళవారం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి డాక్టర్ పి. శాంతి కళ కల్లూరు లోని 9 వ అంగన్వాడి కేంద్రంలో జరుగుచున్న పోషకాహార పక్షోత్సవాలలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాదికారి మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పోషకాహార పక్షోత్సవాలను 08.04.2025 నుండి 22.04.2025 వరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయము తో నిర్వవహిస్తున్నట్లు తెలిపారు . ముఖ్యంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసుర్లు( ఎంఎల్ హెచ్పి) , ఆరోగ్య కార్య కర్తలు , ఆశా కార్యకర్తలు , అంగన్వాడి కార్య కర్తలు సమన్వయము తో ఈ క్రింది విషయాలపై అవగాహన కల్పిస్తారని తెలిపారు.మొదటి 1000 రోజుల సంరక్షణ ( గర్బదారణ సమయం 270 రోజులు + బిడ్డకు 2 సం II వయస్సు అనగా 730 రోజులు వరకు )తల్లి మరియు బిడ్డలలో ఫోషకాహార లోప నివారణ పిల్లలలో ఊబకాయాన్ని తగ్గించడానికి ఆరోగ్య కరమైన జీవనశైలి . బిడ్డకు 6 నెలల వరకు తల్లి పాలు మాత్రమే పట్టి౦చడం . బిడ్డకు 6 నెలల తరువాత అను బంద ఆహార ఆవశ్యకత . వ్యాదినిరోదక టీకాల ప్రాముఖ్యతపై అవగాహన .ఫోషకాహార ప్రదర్శన శాలల ద్వారా అవగాహన . పై విషయాలపై జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్య క్రమాలు నిర్వహించడం వల్ల మాతా , శిశు ఆరోగ్యం మెరుగుపడి మాతృ మరియు శిశు మరణాలను నివారించవచ్చునని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిడిపిఓ అనురాధ , అంగన్వాడి సుపర్వైసర్ లు , అంగన్వాడి కార్యకర్తలు ,ఆరోగ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.