పౌష్టికాహారంతోనే రోగ నిరోధక శక్తి : సీడీపీఓ
1 min read
నందికొట్కూరు,పగిడ్యాల మిడుతూరులో ముగిసిన శిక్షణ..
నందికొట్కూరు, న్యూస్ నేడు : నంద్యాల జిల్లా నందికొట్కూరు,పగిడ్యాల, మిడుతూరు మండల కేంద్రాల్లోగత మూడు రోజులుగా అంగన్ వాడీ కార్యకర్తలకు జరుగుతున్న ‘పోషణ్ భీ- పడాయి భీ’ అనే కార్యక్రమంపై అంగన్ వాడీ కార్యకర్తలకు వివిధ మండలాల సూపర్ వైజర్ల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున సీడీపీఓ కోటేశ్వరమ్మ నందికొట్కూరు,పగిడాలలో జరిగే శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.ఈ కార్యక్రమం ఉ.9 నుంచి సా 5 గంటల వరకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా 0-3 సంవత్సరముల పిల్లల అభివృద్ధి వారి ఎదుగుదల మరియు 0-6 సం.ల చిన్నారుల విద్యను ఆట పాటల ద్వారా బోధించడం పోషణ పెరుగుదల పర్యవేక్షణ గురించి సూపర్వైజర్లు అవగాహన కల్పించారు.ప్రీ స్కూల్ నందు పిల్లల్లో అభివృద్ధి మరియు తల్లి బిడ్డల పోషణ మరియు ఆరోగ్యం గురించి గ్రామల్లో కుటుంబాల్లో అవగాహన కలిగించి తల్లి బిడ్డల సంక్షేమంపై తీసుకోవలసిన జాగ్రత్తల నవచేతన్ లో భాగంగా పుట్టినప్పటి నుండి 3 సం వరకు ఆధార్ సీలలో 3నుండి 6 సo పిల్లల్లో పెరుగుదల పర్యవేక్షణలో వయస్సుకు తగ్గ బరువు,ఎత్తు ఉండాలి అప్పుడే చిన్నారులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతారని చిన్నారుల ఇండ్లకు వెళ్లి చిన్నారుల పట్ల ప్రేమతో చూడాలని వారిని మంచిగా పలకరిస్తూ వారికి మంచి పోషకాహారం ద్వారా వారి జీవిత అభివృద్ధికి తోడ్పాటు అందించాలని గృహ సందర్శన ద్వారా కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఐ సీడీఎస్ సూపర్వైజర్లు నందికొట్కూరు వెంకటేశ్వరమ్మ,ఆశీర్వాదమ్మ, అనురాధ,పగిడ్యాల ఎం. శేషమ్మ, పావని,మిడుతూరు,వరలక్ష్మి, రేణుకా దేవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
