PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గర్భిణీలకు.. పోషకాహారం అందించాలి

1 min read

ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్,

  • అన్నమయ్య జిల్లా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు

పల్లెవెలుగు, అన్నమయ్య జిల్లా బ్యూరో:అన్నమయ్య జిల్లాలోని గర్భవతులు, బాలింతలు, చిన్నారులకు తప్పనిసరిగా అంగన్వాడి కేంద్రాల ద్వారా సంపూర్ణ పోషకాహారం అందించాలని ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు అంగన్వాడి సిబ్బందికి సూచించారు. బుధవారం మదనపల్లె పట్టణంలోని రామారావు కాలనీ అంగన్వాడి సెంటర్ ను ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఏపీ డెయిరీ డెవలప్ మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు అన్నమయ్య జిల్లా స్పెషల్ ఆఫీసర్ అహ్మద్ బాబు మాట్లాడుతూ…..గర్భవతులు, బాలికలు, చిన్నారులకు సంపూర్ణ పోషణలో భాగంగా గుడ్లు, పాలను సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వం అందించే పౌష్టికాహారం పంపిణీలో ఎటువంటి సమస్యలు తలెత్తకూడదన్నారు. తీవ్ర రక్తహీనత కలిగిన వారికి అంగన్వాడీ కేంద్రాలలో ఐరన్ పోలిక్ యాసిడ్ మాత్రలను వేసుకునేలా చూడాలన్నారు.  బరువు తక్కువ ఉన్న పిల్లలు, స్టెంటేడ్ పిల్లలకు కూడా అంగన్వాడి కేంద్రాలలో ఆహారం తినేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎండి ఏపి డిడిసిఎఫ్ అహ్మద్ బాబు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్  ఇద్దరు గర్భవతులకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో మురళి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author