నేటితో ముగిసిన పౌష్టికాహార పక్ష ఉత్సవాలు
1 min read
పోషక విలువలతో కూడిన ఆహారమే ఆరోగ్య పరిరక్షణకు కీలకమ్
ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి)
చంటి బిడ్డల ఆరోగ్య భవిష్యత్తుకు తల్లిపాలే కిలకం
మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : పోషక విలువలతో కూడిన ఆహారమే ఆరోగ్య పరిరక్షణకు కీలకమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సూచించారు. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం పౌష్టికాహార పక్షోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని లక్ష్యసాధన దిశగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర మేయర్ షేక్ నూర్జహాన్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహారాల ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే చంటి, మేయర్ నూర్జహాన్‌లు ఆహారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ పోషక విలువలతో కూడిన పౌష్టికాహారం చేసే మేళ్ళను వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టిసారించిందని చెప్పారు. బిడ్డల ఆరోగ్యకర భవిష్యత్తుకు తల్లిపాలే కీలకమని పేర్కొన్నరు. ఆరోగ్యమే ఉన్నతాలోచనకు ముఖ్యమని అటువంటి మేధావులే రాష్ట్ర, దేశాభివృద్ధికి అవసరమని అభిప్రాయపడ్డారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో పౌష్టికాహారాన్ని అవసరార్ధులకు అందించేందుకు కూటమి ప్రభుత్వం చేస్తోన్న ఆలోచనలో తల్లులంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి కె.శారద,కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రతాప్, డిప్యూటి మేయర్ పప్పు ఉమామహేశ్వరరావు, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు,టిడిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
