PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పత్తికొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించిన న్యాక్ బృందం

1 min read

-ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు

పల్లెవెలుగు  వెబ్ పత్తికొండ : పత్తికొండ పట్టణం, ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం బెంగళూరు న్యాక్ అధికారులు సందర్శించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మాధురి, కళాశాల అధ్యాపక బృందం  న్యాక్ అధికారులకు స్వాగతం పలికారు. ముందుగా ప్రిన్సిపాల్ ఛాంబర్ లో కళాశాల యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను న్యాక్ అధికారులు  చైర్మన్ డాక్టర్ హిమన్షు పాండ్యా, ప్రొజిత్ కుమార్, సభ్యులు డాక్టర్ బి.సుధాకర్  పరిశీలించారు. అనంతరం కళాశాలలోని వివిధ సబ్జెక్టుల యొక్క తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి కళాశాలలోని వాతావరణం  మరియు బోధనాంశాల  గురించి   అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థులతో న్యాక్ అధికారులు సమావేశం నిర్వహించారు. కళాశాల పూర్వ విద్యార్థులు  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ సెంటర్ మరియు బాలికలకు వసతి గృహం ఏర్పాటు చేయాలని న్యాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కళాశాల ఆవరణలో ఏర్పాటుచేసిన విద్యార్థుల నృత్య ప్రదర్శనను తిలకించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

About Author