NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విమానంలో అస‌భ్య ప్రవ‌ర్తన‌.. ఆ వ్యక్తిని సీటుకు క‌ట్టేశారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : విమానంలో అస‌భ్యంగా ప్రవ‌ర్తించిన ఓ వ్యక్తికి విమాన సిబ్బంది త‌గిన రీతిలో బుద్ధి చెప్పారు. ఫిల‌డెల్ఫియా నుంచి మియామీ వెళ్తున్న విమానంలో మాక్స్ వెల్ బెర్రీ అనే యువ‌కుడు మ‌హిళా సిబ్బందితో అస‌భ్యంగా ప్రవ‌ర్తించాడు. తాక‌రాని చోట తాకి వెకిలి చేష్టల‌కు పాల్పడ్డాడు. తోటి ప్రయాణీకుల‌తో మాట‌ల యుద్దానికి దిగాడు. ప్రశ్నించిన సిబ్బంది పై దాడికి దిగాడు. ఆ యువ‌కుడి దురుసుత‌నాన్ని భ‌రించ‌లేని సిబ్బంది అత‌ని సీటుకే క‌ట్టేసి.. నోటికి ప్లాస్టర్ వేశారు. విమానం ల్యాండ్ అయ్యాక అత‌డిని పోలీసుల‌కు అప్పగించారు. ఈ ఘ‌ట‌నను కొంద‌రు మొబైల్ లో చిత్రీక‌రించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

About Author