డాట్ సెంటర్ శాస్త్రవేత్తల పత్తి మొక్కజొన్న పంటల పరిశీలన
1 min read
పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల పరిధిలోని బిలకల గూడూరు గ్రామంలోని పత్తి మరియు మొక్కజొన్న పంట పొలాలను శుక్రవారం నాడు జిల్లా ఏరువాక కేంద్రం , నంద్యాల ప్రిన్సిపల్ సైంటిస్ట్ సరళమ్మ మరియు జిల్లా వనరుల కేంద్రం,నంద్యాల ఏవో ప్రభావతమ్మ సందర్శించి రైతులకు పత్తి మొక్కజొన్న పంటపై సూచనలు సలహాలు ఇచ్చారు పత్తి పంట పైన .ఇందులో ముఖ్యంగా సూక్ష్మ దాతువుల లోపం మరియు తామర పురుగుల ఉధృతి కనుగొనడం జరిగిందని.సూక్ష్మధాతు లోపా నివారణకు నివారణకు జింకు సల్ఫేట్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి,మెగ్నీషియం సల్ఫేట్ 8 -10 గ్రాములు ఒక లీటర్ నీటికి బోరాక్స్ 1గ్రామం ఒక లీటర్ నీటికి ఐరన్ సల్ఫేట్ 2 గ్రాములు మరియు 1 గ్రాము నిమ్మ ఉప్పును కలిపి పిచికారి చేసుకోవాలని తెలియజేశారు. తామర పురుగు నివారణకు ఫిప్రోనిల్ 2 మిల్లీలు ఒక లీటర్ నీటికి పిచికారి చేయాలని తెలియజేశారు. రైతు సోదరులు మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.