దామగట్లలో పంట ప్రయోగాల పరిశీలన..
1 min read
జిల్లా ఉప గణాంక అధికారి రామాంజనేయులు..
పల్లెవెలుగు , నందికొట్కూరు: నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలోని దామగట్ల గ్రామంలో రైతులు వేసిన పంటలను నంద్యాల జిల్లా ఉప గణాంక అధికారి కే రామాంజనేయులు సోమవారం పరిశీలించారు.దామగట్ల గ్రామంలో పర్యటించి ప్రధానమంత్రి పసల్ భీమా యోజన క్రింద పప్పు శనగ పంటను పంటకోత ప్రయోగాలను పర్యవేక్షించారు. యూనిట్ నెంబర్ 6 లో ప్లాటు నెంబర్ 3 సర్వే నెంబరు 137 లో రైతు మల్లా వహీద్ మియా మరియు ప్లాటు నెంబర్ 4 లో సర్వే నెంబరు 271 లో రైతు పి లక్మిరెడ్డి వేసిన పప్పుశనగ పంట దిగుబడి లెక్కింపును 5X5 మీటర్ల ప్లాట్లలో పంటకోత ప్రయోగాలు చేశారు.ప్రయోగ ప్లాటు నెంబరు 3 లో 3.760 కేజీలు మరియు ప్లాటు నెంబరు 4 లో 2.920 కేజీలు దిగుబడి వచ్చినట్లు ఉప-గణాంక అధికారి తెలిపారు.ఈ కార్యక్రమంలో పంటల బీమా ఏజెంట్ మునావర్ భాష, వీహెచ్ఏ మౌనిక, యంపీఈఓ హేమాదేవి,విఆర్ఓ మద్దిలేటి, వీఆర్ఏలు శ్రీనివాసులు, పుల్లయ్య మరియు రైతులు పాల్గొన్నారు.అదే విధంగా గ్రామ సచివాలయ సిబ్బంది చేస్తున్న పీ 4 సర్వేను కొన్ని ఇళ్లను యాధృచ్చింగా పరిశీలించారు.పీ 4 సర్వే ఏ విధంగా చేయాలి సర్వే గురించి సచివాలయ సిబ్బందికి సలహాలు సూచనలు తెలియజేశారు.