PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తలముడిపి లో జూనియర్ సివిల్ జడ్జి పరిశీలన

1 min read

 పల్లెవెలుగు వెబ్, మిడుతూరు: మండలపరిధిలోని తలముడిపి గ్రామంలో నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి తిరుమలరావు పరిశీలించారు.గతంలో జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో సచివాలయం,రైతు భరోసాకేంద్రం నిర్మాణంలో ఉండగా వాటిని పాఠశాల ప్రాంగణంలో నిర్మాణాలు చేపట్టకూడదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినందున అప్పుడు అధికారులు నిర్మాణాలు ఆపివేసి స్థలాన్ని పాఠశాలకు అప్పగించారు.హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈరోజు (ఆదివారం)గ్రామానికి వచ్చి పాఠశాల ప్రాంగణంలో కలియతిరిగారు.సర్వేనెంబర్ 140,141లో పాఠశాలకు పదకొండు ఎకరాలకు పైగా ఉన్నట్లు తేలింది. పాఠశాలకు ఉన్న స్థలాన్ని మండల సర్వేయర్ హేమంత్ రెడ్డి ద్వారా కొలతలు వేయించారు.పంచాయతీ కార్యదర్శి శాలుబాషా,విఆర్ఓ సంజీవ,పాఠశాల హెచ్ఎం పార్వతి వీరి స్టేట్ మెంట్ ను జడ్జి తీసుకున్నారు.ఈనివేదికలను హైకోర్టుకు పంపుతామని వారు తెలియజేశారు.ఈకార్యక్రమంలో తహసీల్దార్ సిరాజుద్దీన్,గ్రామసర్పంచ్ వెంకటేశ్వర్లు, ఎస్సై మారుతి శంకర్ మరియు పోలీస్ సిబ్బంది,వైసిపి నాయకులు మల్లు శివనాగిరెడ్డి,వంగాల సిద్ధారెడ్డి,వంగాల సీతారామిరెడ్డి, రైతులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

About Author