NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓబుల్​రెడ్డి మృతి..బాధాకరం: సాయినాథ్​ శర్మ

1 min read

పల్లెవెలుగు వెబ్​:కమలాపురం మండలం కే అప్పాయపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ పార్టీ నాయకుడు మారుజోళ్ళ ఓబుల రెడ్డి బుధవారం ఉదయం మృతి చెందాడు. ఓబులరెడ్డి కమలాపురం పట్టణంలో రాజకీయంగా ప్రాబల్యం ఉన్న వ్యక్తి కావడం ఆయనకు పేద బడుగు బలహీన వర్గాల లో మంచి పట్టు ఉండటంతో చాలా మంది తండోప తండాలుగా ఆయనను చూడడానికి విచ్చేసారు ఓబులరెడ్డి స్వతహాగా తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్ఠతకు విశేష కృషి చేసారు వీర శివారెడ్డి తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసినప్పుడు ఆయన గెలుపుకు ఓబులరెడ్డి  విశేష కృషి చేసారు. ఆనంతరం కమలాపురం నియోజక వర్గ రాజకీయాలలో జరిగిన పరిణామాల కారణంగా ఓబులరెడ్డి ఆయన కుమారులు వైసీపీ పార్టీ లో చేరారు ప్రస్తుతం ఓబుల రెడ్డి కుమారుడు శ్రీనివాసుల రెడ్డి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొంది కమలాపురం మున్సిపాలిటి కి వైస్ చైర్మన్ గా కొనసాగుతున్నారు కాగా రాజకీయాలు పక్కన పెడితే ఓబుల రెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన మృతి చెందినవిషయం తెలుసుకున్న సాయినాథ్ శర్మ ఓబులరెడ్డి గృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి కన్నీటి పర్యంతమై నివాళులర్పించారు ఆనంతరం ఆయన పాడే మోసి ఓబుల రెడ్డి పై సాయినాథ్ శర్మ కు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

About Author