PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘అన్నమయ్య’కు..ఓడిఓపి అవార్డు

1 min read

అన్నమయ్య జిల్లా బ్యూరో, పల్లెవెలుగు:గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్  వారు వన్ డిస్ట్రిక్ వన్ ప్రోడక్ట్ పథకంలో భాగంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు ప్రతిష్టాత్మక అవార్డు దక్కింది.  అన్నమయ్య జిల్లాకు ఓడిఓపి జిల్లా అవార్డును జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, తరపున జిల్లా చేనేత మరియు జోలి శాఖ అధికారి పి శ్రీనివాసరెడ్డి న్యూఢిల్లీ  ప్రగతి మైదానం భారత్ భవనం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి  పియుష్ గోయల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్, చేతుల మీదుగా జనవరి మూడో తేదీ బుధవారం అందుకొని గురువారం కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా కలెక్టర్ కు  అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ….దేశవ్యాప్తంగా ఒక్కో జిల్లా నుంచి ఒక ఉత్పత్తిని గుర్తించి ఆ ఉత్పత్తి యొక్క విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా తెలియజేసేందుకు మరియు సదరు ఉత్పత్తిని ప్రోత్సహించుటకు ఓడిఓపి అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ పథకం కింద అన్నమయ్య జిల్లా నుండి మదనపల్లి చేనేత పట్టుచీరలను అందరి సహకారంతో  ఓడిఓపి ఉత్పత్తిగా  గుర్తించడమైనది.  అదేవిధంగా  ఓడిఓపి ఉత్పత్తి అయిన మదనపల్లి పట్టుచీరలు యొక్క ఉత్పత్తి నైపుణ్యతను మరియు కళాకారులను ప్రోత్సహించుటకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలు మరియు జిల్లా యంత్రాంగం అమలుపరిచిన పథకాలతో కలిగిన అభివృద్ధి, మొదలైన వాటిని ఆధారం చేసుకుని ఓడిఓపి డిస్టిక్ అవార్డులను ప్రధానం చేయుటకు గత జులై నెలలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ నుండి నామినేషన్లు ఆహ్వానించడమైనదన్నారు. సదర అవార్డు కొరకు మదనపల్లి పట్టుచీరలు  ఉత్పత్తిని, మార్కెటింగ్ ప్రోత్సహించుటకు జిల్లా  యంత్రాంగం తీసుకున్న చర్యలను మరియు చేనేత కార్మికుల బాగోగులు కొరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాను మరియు వాటి అమలు వల్ల జరిగిన లబ్దిని మార్కెటింగ్ లో వచ్చిన అభివృద్ధిని మొదలగు అంశములను క్రోడీకరించి అవార్డు నామినేషన్ ఫైల్ చేయడం జరిగింది.   నామినేషన్లు పరిశీలనకు మరియు ఎవల్యూషన్ కొరకు గత అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతినిధి బృందం సదరు అవార్డు నామినేషన్ పత్రాను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓడిఓపి జిల్లా అవార్డులు దేశవ్యాప్తంగా పది జిల్లా స్థాయి మరియు  ఎనిమిది రాష్ట్ర స్థాయి, ఆరు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ప్రధానం చేయడం జరిగినది. ఈ  అవార్డులలో

అన్నమయ్య జిల్లాకు   ఓడిఓపి జిల్లా అవార్డు :

ప్రతిష్టాత్మక  అవార్డును జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్, తరపున జిల్లా చేనేత మరియు జోలి శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి న్యూఢిల్లీ  ప్రగతి మైదానం భారత్ భవనం నందు నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి  పియుష్ గోయల్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జయశంకర్ చేతుల మీదుగా బుధవారం   అందుకోవడం జరిగినది.  అవార్డు దక్కడం  మన జిల్లా చేనేత ఉత్పత్తి అయినటువంటి మదనపల్లి పట్టుచీరల యొక్క ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన  ఉత్పత్తికి మార్కెటింగ్ ప్రోత్సహించుటలో   ఉపయోగపడుతుంది. తద్వారా చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్వో సత్యనారాయణ, చేనేత జోలి శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author