కాణిపాక దేవస్థానం వారిచే పట్టువస్త్రాల సమర్పణ
1 min readపల్లెవెలుగు వెబ్ శ్రీశైలం: శ్రీశైల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం, కాణిపాకం ఉదయం శ్రీశైల మల్లన్న పట్టువస్త్రాలను సమర్పించారు. కాణిపాక దేవస్థానం తరుపున దేవస్థాన ధర్మకర్తలమండలి అధ్యక్షులు . మోహన్రెడ్డి, ఈఓ వెంకటేశు శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు శ్రీకృష్ణదేవరాయల గోపురం వద్ద సంప్రదాయాన్ని అనుసరించి శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈఓ ఎస్. లవన్న, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు, శ్రీ వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానం అధికారులకు స్వాగతం పలికారు.అనంతరం ఆలయ రాజగోపురం వద్ద పట్టువస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారుఅనంతరం కాణిపాక దేవస్థాన అధికారులు, అర్చకులు మేళతాళాలతో ఆలయ ప్రవేశం చేసి వస్త్ర సమర్పణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ దేవస్థానం పర్యవేక్షకులు. కోదండపాణి తదితరులు పాల్గొన్నారు. కాణిపాక దేవస్థానం నుండి శివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆనవాయితీగా పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోందన్నారు. కాణిపాక దేవస్థానం ఈవో ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అర్చకులు వేద పండితులు పాల్గొన్నారు.