అధికారులు సమన్వయంతో కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేయాలి
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/15-3.jpg?fit=550%2C394&ssl=1)
సచివాలయాల సిబ్బందికి కేటాయించిన విధులను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలి
జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి కేటాయించిన విధులను సంబంధిత శాఖల అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యంపిడివోలు, డిపివో, ఈవోపిఆర్డిలు, ఐసిడిఎస్ సిడిపివోలు, సంబంధిత అధికారులతో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేపట్టిన అంశాలపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సచివాలయాల సిబ్బంది గ్రామాల్లో ఉన్న వాటర్ ట్యాంక్ క్లీనింగ్, క్లోరినేషన్, ఆధార్ కిట్స్ పనితీరు, చంటిపిల్లల ఆధార్ నమోదు ప్రక్రియ, ప్రభుత్వ ఆస్తుల స్వాధీన నివేదిక, తప్పిపోయిన పౌరులను సర్వేద్వారా గుర్తించడం, స్కూలు మరుగుదొడ్లు తనిఖీలు, ఎంఎస్ఎంఇ సర్వే, జిఎస్ డబ్ల్యూఎస్ హాజరు, 18 సంవత్సరాలు వయస్సుగల ఎన్విరాల్ మెంట్, ఎంఎస్ఎంఇ విద్యుత్ శాఖకు సంబంధించిన నివేదికలు తదితర అంశాలపై కలెక్టర్ ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రామ/వార్డ్ సచివాలయాలు ద్వారా చేపట్టే పనులను సంబంధిత శాఖ్గల అధికారులు సమన్వయం చేసుకొని వారికి కేటాయించిన లక్ష్యాలను పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజు గ్రామ, వార్డు సచివాలయాలకు సంబంధించిన నివేదికలను టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ఏరోజుకారోజు రిపోర్టును, తనిఖీలు చేసిన ఫొటోలు క్యాప్షన్ తో సహా నివేదికను అందజేయాలని జిల్లా పరిషత్ సీఈఓ ను కలెక్టర్ ఆదేశించారు.జిల్లాలో కొన్ని మండలాల్లో సచివాలయాలకు కేటాయించిన విధులలో వెనుకబడివున్నాయని దీనికి సంబంధించిన యంపిడివోలు పర్యవేక్షణ చేసి టార్గెట్ ను పూర్తిచేయ్యాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జెడ్పి సిఇఓ కె. సుబ్బారావు, ఎపిఇపిడిసిఎల్ ఎస్ఇ పి. సాల్మన్ రాజు పాల్గొన్నారు.