PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పట్ల అధికారులు అప్రమత్తతో ఉండాలి

1 min read

– జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూల : ఈజ్ ఆఫ్ డూయింగ్….ఈజ్ ఆఫ్ లివింగ్ ఫీడ్ బ్యాక్ సర్వే జరగనున్నందున అధికారులు అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.జి.సృజన మాట్లాడుతూ పరిశ్రమల శాఖకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ క్రింద ఒక సర్వే జరుగునుందని, అయితే కొత్తగా ఈ సారి ఈజ్ ఆఫ్ లివింగ్ కు సంబంధించి కూడా జరుగుతుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులు వారు పొందిన సర్వీసుల పట్ల సంతృప్తిగా ఉన్నారా లేదా అని ఫోన్ కాల్ ద్వారా లబ్ధిదారులను నుండి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం జరిగిందని, అదే విధంగా ఈజ్ ఆఫ్ లివింగ్ కు సంబంధించి జనవరి 1వ తేది 2022వ సం. నుంచి అక్టోబర్ 31వ తేది సం. వరకు సచివాలయాలు, మీసేవలు ద్వారా సర్వీసుల పొందిన వారి వివరాలు భారత ప్రభుత్వానికి సమర్పించడం జరిగిందన్నారు. అందుకుగాను సచివాలయం, వాలంటీర్ సిబ్బంది సేవలు పొందిన లబ్ధిదారులకు ఫోన్ కాల్ వస్తుందని సదరు ఫోన్ కాల్ కు వారు స్పందించి పొందిన సేవల పట్ల వారి అభిప్రాయం వ్యక్తం చేసేలా చూడాల్సిన బాధ్యత ఎంపిడిఓలు, స్పెషల్ ఆఫీసర్ల మీద ఉంటుందన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ కు బట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సంబంధించి దేశ వ్యాప్తంగా ర్యాంకింగ్ ఆధారపడి ఉంటుందన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్నారు. జగనన్నకు చెబుదాంకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రావాల్సి ఉందని, అందులో ఎక్కువ శాతం పోలీస్ శాఖకు సంబంధించి ఉన్నాయని వచ్చిన అర్జీలను ఓపెన్ చేయడం లేదని వచ్చిన అర్జీలను ఎస్హెచ్ఓలు ఓపెన్ చేసి పాజిటివ్ గా నివృత్తి చేసేలా చూడాలన్నారు. జిల్లా అధికారులు ప్రతి రోజు రెండు సార్లు వారికి సంబంధించిన లాగిన్స్ ను ఓపెన్ చేసి చూస్తూ ఉండాలన్నారు. ఇప్పటి వరకు ఇంకా అధికారుల అర్జీలు చూడల్సినవి ఇంకా 29 వరకు ఉన్నాయని, అందులో ఎక్కువ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి ఎక్కువగా ఉన్నాయన్నారు. రీఓపెన్ కేసులు మీద కూడా ఆడిట్ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం ఈజ్ ఆఫ్ డూయింగ్….ఈజ్ ఆఫ్ లివింగ్ పట్ల సర్వే జరుగునుందని అందుకు సంబంధించి సర్కులర్ ను అందరూ జిల్లా అధికారులకు పంపేలా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ జిఎంను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.సమావేశంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు అనురాధ, రమ, నాగ ప్రసన్న లక్ష్మి, జిల్లా పరిషత్ సిఈఓ నాసర రెడ్డి, సిపిఓ అప్పలకొండ, జిల్లా స్థాయి అధికారులు మరియు మండలాల నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

About Author