సమస్యల పరిష్కారానికి అధికారుల పర్యవేక్షణ అవసరం
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 26 అర్జీలు
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం ప్రజా ఫిర్యాదులు పరిష్కారమయ్యేంత వరకు సంబంధిత అధికారుల పర్యవేక్షణ అవసరమని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రకాల సమస్యలకు సంబంధించి 26 అర్జీలను స్వీకరించారు. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కమిషనర్ తెలిపారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఎంఈ సత్యనారాయణ, ఆర్ఓ జునైద్, టిపిఆర్ఓ వెంకటలక్ష్మి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంజాద్ బాష, సర్వేయర్ నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.