NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎమ్మెల్యేకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన అధికారులు, నాయకులు..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఆంధ్ర ప్రదేశ్ లో విద్య వైద్య వ్యవసాయ రంగాల తో పాటు ప్రజల అభివృద్ధి సంక్షేమమే ద్యేయంగా పాలన అందిస్తున్న రాష్ట్ర ముఖ్య మంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ని వన్ స్మోర్ జగనన్న అంటూ 2024 ఎన్నికల్లో మరో మారు ముఖ్య మంత్రి గా ఎన్నుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధం గా ఉన్నారని దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్య చౌదరి అన్నారు. పెదవేగి మండలం కొండలరావు పాలెం లో దెందులూరు ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి క్యాంపు కార్యాలయం లో సోమవారం జరిగిన నూతన సంవత్సర వేడుకలసంబరాలు అంబరాన్నంటాయి ఈ సందర్భం గా అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంద్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచిందని చెప్పారు.  ..దెందులూరు నియోజక వర్గం లో ప్రజా సంక్షేమం కోసం సర్వీస్ మొటివ్ తో పనిచేసి అభివృద్ధి సంక్షేమం లో  దెందులూరును అగ్ర గామిగా నిలిపానని 2024 ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించి దెందులూరును మరింత అభివృద్ధి చేస్తానన్నారు.ఈ వేడుకలకు  పెదపాడు.పెదవేగి.దెందులూరు.ఏలూరు మండలాల నుండి జెడ్ పి టి సి లు.ఎం పి పి లు .సర్పంచ్ లు ఎం పి టి సి లుప్రజా ప్రతినిధులు.వై సి పి నాయకులు .కార్యకర్తలు .అధికారులు తమ అభిమాన ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి ని స్వయంగా కలిసి  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.అయోధ్యనుంది వచ్చిన తలంబ్రాలను కొండలరావు పాలెం ఆడపడుచులు రామనామ స్మరణతో వచ్చి ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరికి అందజేశారు.రాట్నాలమ్మ దేవస్థానం ప్రధాన పండితులు వేదం మంత్రాలతో ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి  2024 లో రెండవసారి దెందులూరు ఎం ఎల్ ఏ పదవి ని అఖండ మెజారిటీ తో విజయం సాధిస్తారని శత మనం భవతీ  శతా యుష్మాన్ భవా అంటూ  ఆశీర్వదించారు.ఈ వేడుకలలో ఎం ఎల్ ఏ కేక్ లను కట్ చేసి దెందులూరు నియోజక వర్గ ప్రజలతో .ప్రజా ప్రతినిధులతో.అధికారులతో ఆనందాన్ని పంచుకున్నారు.

About Author