అధికారులు తెలుగుదేశం ఓట్లను తొలగిస్తున్నారు..
1 min readమాజీ ఎమ్మెల్యే టిడిపి పాణ్యం ఇన్చార్జి గౌరు చరితారెడ్డి.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: (గడివేముల) మండల కేంద్రంలోని అధికారులు తెలుగుదేశం పార్టీకి చెందిన ఓట్లను తొలగించి వేరే నియోజకవర్గానికి చెందిన వైసిపి పార్టీకి చెందిన కొంత మంది వ్యక్తులు మండలంలోని వివిధ గ్రామాల్లో ఓటరుగా నమోదు చేసుకున్నారని మంగళవారం నాడు తాసిల్దార్ కార్యాలయంలో ఏఈఆర్ఓ శ్రీనివాసులు ను నిలదీశారు అధికారులు ఏ ప్రాతిపదికన వాళ్ళ ఓట్లు తొలగించకుండా అసలు ఎటువంటి ఆధారాలు సమర్పించి ఉంటే వైసిపి వాళ్ళ ఓట్లు కొనసాగిస్తున్నారని ఇదేవిధంగా అధికారులు వ్యవహరిస్తే ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేస్తామని గౌరు చరితారెడ్డి హెచ్చరించారు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది అధికార పార్టీ వారు తాము గెలవలేమనే ఆలోచనతో ఇటువంటి పనులు చేస్తున్నారని వారికి అధికారులు వత్తాసు పలకడం పద్ధతి కాదన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ సత్యం రెడ్డి. మాజీ జెడ్పిటిసి సీతారామరెడ్డి. పంట రాంచంద్రారెడ్డి. ఓడ్డు లక్ష్మీదేవి .రఫిక్ . ఫారుక్. బివీఎన్ రాజు . శ్రీనివాసులు. దిలీప్ పంట రామ్ మద్దిలేటి రెడ్డి. టిడిపి నాయకులు పాల్గొన్నారు.