ఉద్యాన పంటలను పరిశీలించిన అధికారులు
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లి గ్రామ పొలాలలో అకాల వర్షాల కారణంగా కర్బూజా/ దోస పంటలను మంగళవారం ఉద్యాన అధికారి జ్యోతిర్మయి పరిశీలించడం జరిగింది, అలాగే అక్కడ దోస పంటకు సంబంధించి తామర పురుగులు, అలాగే బూజు తెగులు ఆశించడం ఆమె పరిశీలించారు, అనంతరం ఆమె అక్కడి రైతులతో మాట్లాడుతూ, దోస పంటలో తామర పురుగులు, అదేవిధంగా బూజు తెగులు సోకిందని దీని నివారణకు రైతులు జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా బూజు తెగులు నివారణకు ఒపేరా 1.5 ml / లీటర్ల నీటిని లేదా కెబ్రియో టాప్ 3గ్రా/లీ లేదా హెడ్లైన్1ml ను పిచికారి చేసుకోవాలని రైతులకు సూచించడం జరిగింది, అంతేకాకుండా తామర పురుగుల నివారణకు పెగసుస్1.5ml/లీ లేదా పెప్రో నిల్ 2ml/లీ దీనితోపాటు13-0-45 10గ్రా/లీ నీటిని కలిపి పిచికారి చేస్తే పంటలను రైతులు సంరక్షించుకో గలరని ఆమె తెలిపారు, అలాగే ఎకరాకు 4-6 పసుపు జిగురు అట్టలు పెట్టుకోవాలని రైతులకు తెలపడం జరిగింది, ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.