జిల్లా లీగల్ మెట్రాలజీ శాఖ అధికారులు విస్తృత తనిఖీలు..
1 min read– వివిధ రకాల ప్యాకేజీలపై కేసులు నమోదు..
– బి వి హరిప్రసాద్ లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : లీగల్ మెట్రాలజీ, ఆంధ్ర ప్రదేశ్, విజయవాడ G. వీరపాండ్యన్ ఆదేశముల మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, బియ్యం మరియు ఎడిబుల్ ఆయిల్ విక్రయించు వ్యాపారస్తులపై తనిఖీలు నిర్వహించడమైనది. సదరు తనీఖీలలో ముఖ్యముగా ముందుగా ప్యాకింగ్ చేసినటువంటి కందిపప్పు, బియ్యం మరియు ఎడిబుల్ ఆయిల్ ప్యాకేజీలపై ముద్రిత ధరలు కంటే ఎక్కువ ధరకు అమ్మకం చేయు వ్యాపారస్తులపై మరియు సదరు ప్యాకేజీలపై M.R.P. ధరలను ముద్రించని వ్యాపారస్తుల దుకాణములపై తనిఖీలు నిర్వహించి, లీగల్ మెట్రాలజీ శాఖ ఏలూరు జోన్ పరిధిలోని తక్కువ తూకము గల ప్యాకేజీలపై 01 కేసు, ప్యాకేజీ కమోడిటీస్ రూల్స్ ఉల్లంఘనలపై 14 కేసులు మరియు ముద్ర లేని తూనిక యంత్రములపై 02 కేసులు మొత్తం 17 కేసులు నమోదు చేయడం జరిగినది. సదరు కేసులలో ఏలూరు నగరము నందు 05 కేసులు, మరియు భీమవరం నగరము నందు 12 కేసులు నమోదు చేయడం జరిగినద నాని ఒక ప్రకటనలో తెలిపారు.ఈ తనిఖీలలో పి. సుధాకర్, సంయుక్త నియంత్రకులు, లీగల్ మెట్రాలజీ, ఏలూరు మరియు బి.వి.హరిప్రసాద్, ఉప నియంత్రకులు, లీగల్ మెట్రాలజీ, ఏలూరు వారితో సిబ్బంది పాల్గొన్నారు. B.N.V.S.ఈశ్వర రామ్, సహాయనియంత్రకులు, లీగల్ మెట్రాలజీ, ఏలూరు V.V. నాగరాజారావు. సహాయనియంత్రకులు, లీగల్ మెట్రాలజీ, భీమవరంV.ప్రశాంత్ కుమార్, ఇనస్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, ఏలూరు రాంబాబు, ఇనస్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, భీమవరంG.V. ప్రసాద్, ఇన్ ఛార్జ్ ఇనస్పెక్టర్, లీగల్ మెట్రాలజీ, కొవ్వూరు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు.