కేసీ కెనాలపై అక్రమ కట్టడాల ను తొలగించిన అధికారులు
1 min read
కేసికినాలపై ఎవరైనా అక్రమంగా కట్ట కట్టడాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవు
న్యూస్ నేడు చెన్నూరు : చెన్నూరు వద్ద గల కేసి కెనాల్ కు ఎదురుగా ( స్థానిక ఎస్బిఐ బ్యాంకు ఎదురుగా) ఉన్న భూములలో కొంతమంది స్థలాలు కొనుగోలు చేసి ఆ స్థలాలను అడ్డుగా పెట్టుకుని అక్రమంగా కేసీ కెనాల్ కు సంబంధించిన భూములను కూడా ఆక్రమించుకొని ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని చెన్నూరు కు చెందిన అంబవరం భాస్కర్ రెడ్డి, కేసి కెనాల్ కు సంబంధించిన సర్వే నంబర్ 840-బి 1- 841బి 1 కొంతమంది ఆక్రమించి ఇంటి నిర్మాణాలు చేపడుతున్నారని దీని ద్వారా మిగతా రైతులకు వారి భూములలోకి వెళ్లేందుకు ఇబ్బందికరంగా ఉందని కేసీ అక్రమ కట్టడాల పైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కు, రెవిన్యూ అధికారులకు, కెసి కెనాల్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కేసీ కెనాల్ అధికారులు, స్థానిక అధికారులకు ఈ విషయమై తెలియజేయడంతో, రెవిన్యూ అధికారులు కేసీ కెనాల్ కు సంబంధించిన భూమిని సర్వే చేసి కేసి కెనాల్ భూమి కబ్జాకు గురైందని నిర్ధారించడం జరిగింది. అప్పటినుండి అధికారులు సంబంధిత ఇంటి నిర్మాణదారునికి నోటీసులు ఇచ్చినప్పటికీ అతను తొలగించకుండా అలాగే ఉండడంతో, శనివారం మండల అధికారులు, పంచాయతీ అధికారులు అక్రమ కట్టడాలను తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధికారులు, పంచాయతీ అధికారులు మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాలు, ఆక్రమించిన, వాటిపై అక్రమ కట్టడాలు చేపట్టిన కఠిన చర్యలు తప్పవని, ఇలా కేసి కెనాల్ భూములను ఆక్రమించడం ద్వారా మిగతా రైతులకు వారి పొలాలలోకి వెళ్లేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయని దీని ద్వారా అనేక సమస్యలు ఉత్పన్నం అవ్వడమే కాకుండా ఘర్షణలకు తావిస్తుందని, ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండేందుకే ఇలాంటి కఠిన చర్యలు చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డి సురేష్ బాబు, కార్యదర్శి రాము సుబ్బారెడ్డి, వీఆర్వో రసూల్, తదితరులు పాల్గొన్నారు.
