వేసవి కాలంలో త్రాగునీటి కొళాయిని తొలగించిన అధికారులు
1 min read– త్రాగునీటికి ఇబ్బందిగా ఉంది కొళాయిని బాగు చేయమని అభ్యర్థించిన గ్రామ ప్రజలు
– కులాయి వేయాలని ఎంపీడీవో, ఎంపీపీ ఆదేశించిన పట్టించుకోని కార్యదర్శి
– త్రాగునీటికి కూడా రాజకీయ గ్రహణమా అంటున్న బిసి లు
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వేసవి కాలంలో ఎక్కడ కూడా ప్రజలకు త్రాగునీటి విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభుత్వం, పై అధికారులు చెబుతున్నప్పటికీ కింది అధికారులు ఆ మాటలను పట్టించుకున్న పాపాన పోలేదు, పైగా ఉన్న తాగునీటి కొళాయిలను తొలగించడం జరుగుతున్నది, ఇందుకు నిదర్శనం మండలంలోని రామనపల్లి బీసీ కాలనీలో చోటుచేసుకుంది, రామనపల్లె గ్రామంలో బీసీ కాలనీ వద్ద ఉన్న త్రాగునీటి కొళాయి నీ పంచాయతీ అధికారులు తొలగించారు, ఎందుకు తొలగించారు అని ప్రజలు అడగగా, డబ్బులు ఇస్తేనే కుళాయి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందని పంచాయతీ అధికారులు చెప్పడం జరిగిందని అక్కడ ప్రజలు వాపోతున్నారు, పబ్లిక్ కులాయి కి డబ్బులు ఎందుకు ఇవ్వాలని, ఎండాకాలంలో కుళాయిని తొలగించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు, అంతేకాకుండా ఈ విషయమై రెండు నెలలుగా కార్యదర్శిని కులాయి వేపించమని అడుగగా ఆమె ఈరోజు రేపు అంటూ కాలయాపన చేస్తుందని వారు ఆరోపించారు, అంతేకాకుండా ఈ విషయమై ఎంపీపీ, ఎంపీడీవో కార్యదర్శికి చెప్పినప్పటికీ ఆమె పెడచెవిన పెట్టడం ఎంతవరకు సబబు అని అక్కడి బీసీ గ్రామ ప్రజలు మండిపడుతున్నారు, త్రాగునీటి విషయంలో కూడా రాజకీయాలు చేయడం ఏంటని, గ్రామంలో ఇలాంటి విష సంస్కృతి తీసుకురావడం మంచిది కాదని వారు అంటున్నారు, డబ్బులు కావాలన్నా ఇస్తామని కుళాయి కనెక్షన్ ఇప్పించండి మహాప్రభో అంటూ అధికారులను వారు వేడుకుంటున్నామని, అయినప్పటికీ అధికారులు బీసీలమైన తమపై ఎందుకు అంత వివక్షత చూపుతున్నారో అర్థం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు, గతంలో ఇక్కడ ఉన్న కులాయి నీళ్లు వేస్ట్ గా పోతున్నాయి టాప్ వేయించాల్సిందిగా కోరడం జరిగింది, దీనిని దృష్టిలో ఉంచుకొని అక్కడ కులయిని పూర్తిగా లేకుండా చేయడం మంచి పద్ధతి కాదని వారు ఆరోపిస్తున్నారు, ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని కులాయి వేయించాల్సిందిగా వారు కోరుతున్నారు. సోమవారం గ్రీవెన్స్ ల్లో ఎంపీడీవో , చరవాణి ద్వారా కార్యదర్శికి చెప్పినప్పటికీ ఆమెలో ఎలాంటి స్పందన కనిపించడం లేదు, బీసీ కాలనీ పై త్రాగునీటి విషయంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్న తీరుపై బీసీ కాలనీ ప్రజలమంతా కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ఆమెపై ఫిర్యాదు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు.